రోహిత్‌ వర్థంతి: హెచ్‌సీయూలో ఉద్రిక్తత | Tense at HCU on Rohith Vemula death anniversary | Sakshi
Sakshi News home page

రోహిత్‌ వర్థంతి: హెచ్‌సీయూలో ఉద్రిక్తత

Jan 17 2017 6:01 PM | Updated on Sep 5 2017 1:26 AM

హెచ్‌సీయూ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన

హెచ్‌సీయూ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన

రోహిత్‌ వర్ధంతి సభను పోలీసులు అడ్డుకోవడంతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత తలెత్తింది.

హైదరాబాద్‌: సరిగ్గా ఏడాది కిందట.. రీసెర్చ్‌ స్కాలర్‌ రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మళ్లీ ఇవ్వాళ అలాంటి వాతావరణమే నెలకొంది. మంగళవారం రోహిత్‌ వర్ధంతి సందర్భంగా వర్సిటీ క్యాంపస్‌లో భారీ సంస్మరణ సభను నిర్వహించాలనుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.

ముందుగా ప్రకటించినట్లే వర్సిటీ క్యాంపస్‌లో రోహిత్‌ వర్ధంతి సభను జరిపితీరుతామని విధ్యార్థులు భీష్మించారు. సభలో పాల్గొనేందుకు దేశంలోని పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, పలు ప్రజా సంఘాల నాయకులు హెచ్‌సీయూకు తరలివచ్చారు. కానీ సభకు అనుమతిలేని కారణంగా పోలీసలు వారిని అడ్డుకున్నారు. ఒకదశలో ఇరుపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement