పార్లమెంట్ సాక్షిగా టీడీపీ మరోసారి డబుల్ గేమ్ ఆడుతోంది.
ఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా టీడీపీ మరోసారి డబుల్ గేమ్ ఆడుతోంది. ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు లోపల, తెలంగాణ ఎంపీలు బయట ఆడుతున్న డ్రామా రసవత్తరంగా సాగుతోంది.
పార్లమెంట్ ఉభయసభల్లో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సమైక్య నినాదాలు చేస్తున్నారు. పార్లమెంట్ బయట రాష్ట్ర విభజన బిల్లు కోసం తెలంగాణ టీడీపీ నేతలు పట్టుపడుతున్నారు. ఒకే పార్టీ రెండు వాదనలతో డబుల్ గేమ్ ఆడుతోంది.