సెబి ఛైర్మన్గా యు.కె. సిన్హా నియామకాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
సెబి ఛైర్మన్గా యు.కె. సిన్హా నియామకాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్, జస్టిస్ హెచ్ఎల్ గోఖలేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన నియామకం నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేసింది.
సిన్హా నియామకాన్ని సవాలుచేస్తూ అరుణ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. సెబి చీఫ్గా ఆయన నియామకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని అగర్వాల్ ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన వాదనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. సెబి చట్టంలోని సెక్షన్ 4 సబ్ సెక్షన్ (5) ప్రకారం, ప్రభుత్వం గతంలో తెలిపిన విషయాల ప్రకారం చూసినా సెబి ఛైర్మన్గా నియమితమయ్యే వ్యక్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని, అది ఆయనకు లేదని అగర్వాల్ వాదించారు.