మరణశిక్షల తగ్గింపుపై సుప్రీం నోటీసు | Supreme Court issues notice to Centre on commuting death sentence | Sakshi
Sakshi News home page

మరణశిక్షల తగ్గింపుపై సుప్రీం నోటీసు

Nov 19 2013 1:42 AM | Updated on Sep 2 2018 5:20 PM

బాలికలపై అత్యాచారం కేసుల్లో మరణశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలకు శిక్షను తగ్గిస్తూ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు వచ్చింది.

న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారం కేసుల్లో మరణశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలకు శిక్షను తగ్గిస్తూ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు వచ్చింది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రానికి నోటీ సు జారీ చేసింది. పిల్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. ప్రతిభాపాటిల్ అప్పట్లో మరణశిక్షను తగ్గించిన మొత్తం 35 కేసుల్లో 5కేసులు బాలికలపై క్రూరాతిక్రూరమైన అత్యాచారాలకు సంబంధించినవని పిటిషనర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement