'ఇమ్రాన్ ఖాన్ ను తొలగించండి' | Students at Bradford University want Imran Khan sacked | Sakshi
Sakshi News home page

'ఇమ్రాన్ ఖాన్ ను తొలగించండి'

Mar 5 2014 7:05 PM | Updated on Sep 2 2017 4:23 AM

'ఇమ్రాన్ ఖాన్ ను తొలగించండి'

'ఇమ్రాన్ ఖాన్ ను తొలగించండి'

పాకిస్థానీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ ను ఛాన్స్ లర్ పదవిని నుంచి తొలగించాలని బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు.

పాకిస్థానీ క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ ను ఛాన్స్ లర్ పదవిని నుంచి తొలగించాలని బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు. బ్రిటన్ లోని బ్రాడ్ పోర్డ్ యూనివర్సిటికి ఇమ్రాన్ ఖాన్ ఛాన్స్ లర్ గా సేవలందిస్తున్నారు. అయితే 2010 సంవత్సరం నుంచి బ్రాడ్ పోర్డ్ యూనివర్సిటి నిర్వహించిన గ్రాడ్యుయేషన్, ఇతర కార్యక్రమాలకు ఇమ్రాన్ హాజరుకాకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ను తొలగించేందుకు యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ రాజకీయాలనో, ఛాన్స్ లర్ పదవిలో దేన్ని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి మొహసిన్ తన్వీర్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఛాన్స్ లర్ గా ఇమ్రాన్ ఖాన్ తన విధులను విస్మరించడంపై విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement