చిమ్మచీకట్లో ‘స్వేచ్ఛాతల్లి’! | Statue of Liberty's lights go out during unplanned outage | Sakshi
Sakshi News home page

చిమ్మచీకట్లో ‘స్వేచ్ఛాతల్లి’!

Mar 9 2017 10:52 PM | Updated on Sep 5 2018 2:07 PM

చిమ్మచీకట్లో ‘స్వేచ్ఛాతల్లి’! - Sakshi

చిమ్మచీకట్లో ‘స్వేచ్ఛాతల్లి’!

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ.

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ. స్వేచ్ఛకు ప్రతీకగా ప్రపంచానికే తలమానికంగా ఆ విగ్రహాన్ని న్యూయార్క్‌ నగరం నడి బొడ్డున నిలబెట్టారు. దాని గురించి సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో పలు కామెంట్లు మోతమోగాయి. ఎన్నడూ లేనిది స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ వద్ద తొలిసారి విద్యుత్‌ లైట్లు ఆగిపోయి చీకట్లో అది దర్శనం ఇచ్చింది. ఇలా కొద్ది సేపు కాదు.. దాదాపు కొన్నిగంటలపాటు. చీకట్లో ఆ విగ్రహాన్ని ఉండటాన్ని చూసిన ఓ ఎర్త్‌ క్యామ్‌ లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది.

దీంతో అసలు అక్కడ లైట్లు ఎలా ఆగిపోయాయి? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు స్వేచ్ఛా తల్లి చీకట్లో ఉండిపోయింది? ‘మహిళ స్వేచ్ఛ నేడు చీకట్లోకి వెళ్లింది’ అంటూ ఇలా రకరకాలుగా ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టారు. అయితే, దీనిని నిర్వహిస్తున్న నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ సంస్థ వివరణ ఇస్తూ..‘ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని అన్నారు. అనుకోకుండా అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సాంకేతిక కారణాలవల్లే కరెంటు పోయిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement