బాయ్‌ఫ్రెండ్‌తో కూతురి డేటింగ్‌పై శ్రీదేవి..! | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌తో కూతురి డేటింగ్‌పై శ్రీదేవి..!

Published Thu, Nov 10 2016 5:32 PM

బాయ్‌ఫ్రెండ్‌తో కూతురి డేటింగ్‌పై శ్రీదేవి..!

శ్రీదేవి, బోనీ కపూర్‌ దంపతుల పిల్లలు జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌కు స్టార్‌ కిడ్స్‌గా బాలీవుడ్‌లో చాలామంచి పేరుంది. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో తమ పోస్టుల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే, ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వి వార్తల్లో నిలిచింది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్‌ టు లిప్‌ కిస్‌ చేసుకున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్‌ షిండే మనవడు అయిన శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదట. జాన్వి, శిఖర్‌ ముద్దుపెట్టుకున్న ఫొటోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న శ్రీదేవి.. కూతురికి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించిందని ముంబై మిర్రర్‌ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న జాన్వి అస్సలు యువకులతో స్నేహం చేయవద్దని, డేటింగ్‌ చేయడం సంగతి దేవుడెరుగు అస్సలు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నా నేను అంగీకరించబోనని కూతురికి గట్టిగా చెప్పినట్టు పేర్కొంది. 
 
ఒక్కప్పటి అందాల కథానాయికగా రాణించిన శ్రీదేవి సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొత్తలో ప్రతిదానికి తల్లి సలహా ఆధారంగా నడుచుకుంది. ఇప్పుడు తన కూతురి విషయంలోనూ అదే సంప్రదాయం కొనసాగాలని ఆమె తాపత్రయపడుతున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement