'స్పైడర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది' | SPYder Pre Release Event | Sakshi
Sakshi News home page

'స్పైడర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది'

Sep 15 2017 8:19 PM | Updated on Jul 23 2019 11:50 AM

'స్పైడర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది' - Sakshi

'స్పైడర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది'

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైథ్రిల్లర్‌ మూవీ 'స్పైడర్‌'.

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైథ్రిల్లర్‌ మూవీ 'స్పైడర్‌'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నగరంలోని శిల్ప కళావేదికలో అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్న ఈ వేడుకలో అలనాటి సూపర్‌ స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

'మహేశ్‌ సినిమా సినిమాకు ఇంప్రూమెంట్‌ చూపిస్తున్నాడు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మద్రాస్‌లో ఉన్న మహేశ్‌ చాలా స్పష్టంగా తమిళ ఆర్టిస్టులాగే మాట్లాడాడు' అని కృష్ణ అన్నారు. గతంలో తమిళం నేర్చుకోలేకపోవడం వల్ల తనకు తమిళ సినిమాలో మొదట అవకాశం వచ్చినా చేయలేకపోయానని గుర్తుచేసుకున్నారు. చాలా గొప్ప దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వంలో తమిళంలో మహేశ్‌ పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ పిక్చర్‌ డెఫినెట్‌గా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలో కృష్ణ, విజయ నిర్మల, మహేశ్‌ బాబు, ఆయన సతీమణి నమ్రత, దర్శకుడు మురగదాస్‌, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇతర చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement