చెన్నై నగరంలోని రామనాథపురం పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని కాల్చి...
ఫిర్యాదుదారుపై ఎస్ఐ కాల్పులు
Oct 14 2014 7:48 PM | Updated on Mar 19 2019 6:59 PM
రామనాథపురం: చెన్నై నగరంలోని రామనాథపురం పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది. మహమ్మద్ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి రాగా, అతనికి సబ్ ఇన్స్ ఫెక్టర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.
ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఎస్ఐ కాళిదాసు ఆవేశంతో మహమ్మద్ కాల్పులు జరిపినట్టు తెలిసింది. కాల్పుల్లో గాయపడిన బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement