క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ | Sakshi
Sakshi News home page

క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Published Tue, Jan 3 2017 11:16 AM

క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

ముంబై: బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎట్టకేలకు మౌనం వీడింది.  దురదృష్టవశాత్తు,   ఇటీవల బీ టౌన్  లో షికార్  చేసిన  పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. సహనటుడు, మరో క్రేజీ హీరో ఫర్హాన్ అక్తర్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న విషయాన్ని పూర్తిగా  తోసిపుచ్చింది.   

ఈ తప్పుడు కథనాలు తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని పేర్కొంది. తామూ మనుషులమే అన్న సంగతిని   గుర్తించనంతవరకు ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని తెలిపింది.   సినీ నటులుగా ఉన్న తమలాంటి వారిపై  గాసిప్స్ చదవడానికి సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇలాంటి కథనాలు తన  తండ్రిని, ఆంటీని, తన సహనటుడిని జోడించడం  సరికాదని వ్యాఖ్యానించినట్టుగా "బొంబాయి టైమ్స్ ' రిపోర్టు చేసింది.

శ్రద్ధా, ఫర్హాన్  పీకల్లోతు ప్రేమలో ముగినిపోయారనీ, ఆ క్రమంలో ఇద్దరూ  సహజీవనం చేస్తున్నారని బీ టౌన్ గుప్పుమంది. ఈక్రమంలో  వీరిద్దరి వ్యవహారం నచ్చని  ఆమె తండ్రి (శక్తి కపూర్)  ఫర్హాన్ అపార్ట్మెంట్ నుంచి శ్రద్ధాను బలవంతంగా  బయటకి లాకొచ్చిన్నట్టుగా కథనాలు వచ్చాయి. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా సీనియర్ కపూర్ ఖండించారు. ఇక ఇపుడు నేరుగా శ్రద్ధా కూడా స్పందించడంతో ఈ వార్తలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
 

కాగా బాలీవుడ్  సెన్సేషనల్ మూవీ ఆషిక్ 2  సినిమాలో గాయకురాలి పాత్రలో  ఆకట్టుకున్న  శ్రద్ధా తాజా చిత్రం 'ఒకే జాను'  సినిమా బిగ్ రిలీజ్ కు సిద్ధంమవుతున్న సంగతి  తెలిసిందే.
 

Advertisement
Advertisement