'సునందకు భారత్ లో ఆస్తులు లేవు' | she had no properties owned by her in India at the time of her death,Shashi Tharoor | Sakshi
Sakshi News home page

'సునందకు భారత్ లో ఆస్తులు లేవు'

Oct 13 2014 4:24 PM | Updated on Mar 29 2019 9:24 PM

'సునందకు భారత్ లో ఆస్తులు లేవు' - Sakshi

'సునందకు భారత్ లో ఆస్తులు లేవు'

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తన దివంగత భార్య సునంద పుష్కర్ ఆస్తులు గురించి తనకు తెలియదన్నారు.

కొచ్చి: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తన దివంగత భార్య సునంద పుష్కర్ ఆస్తులు గురించి తనకు తెలియదన్నారు. సునంద కెనడా పౌరురాలని, ఆమె మృతి చెందేనాటికి సునందకు భారత్ లో ఎటువంటి ఆస్తులు లేవన్నారు. విదేశాల్లోని ఆమె ఆస్తులెన్నో ఇప్పటికీ తెలియడం లేదని వివరించారు. వివిధ కారణాల వల్ల ఆమె ఆస్తులు ఎవరికి చెందాలో కూడా ఇంకా స్పష్టం కావడం లేదన్నారు.  ఈ విషయాన్నికేరళ హైకోర్టుకు అఫిడవిట్‌లో తెలిపారు. ఆమె స్థిర, చరాస్తులను వ్యక్తిగతంగానే కాకుండా, ఆమె కొడుకు (సునంద మాజీ భర్త తనయుడు) తోనూ, మరెవరితోనూ కలసి తీసుకోలేదని స్పష్టం చేశారు.

 

థరూర్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో తన భార్య నుంచి వారసత్వంగా అందుకున్న ఆస్తులను వెల్లడించలేని కారణంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ కార్యకర్త ఒకరు దాఖలైన పిటిషన్‌కు సంబంధించి థరూర్ ఈ అఫిడవిట్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement