నాలుగు దుకాణాల్లో వరుస చోరీలు | Serial robberies in four shops | Sakshi
Sakshi News home page

నాలుగు దుకాణాల్లో వరుస చోరీలు

Aug 6 2015 10:18 PM | Updated on Sep 3 2017 6:55 AM

తాళం వేసిన నాలుగు షాపుల్లో దుండగులు ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు.

కుషాయిగూడ: తాళం వేసిన నాలుగు షాపుల్లో దుండగులు ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈసీఐఎల్- చక్రిపురం చౌరస్తాల మధ్య బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మొదట నాగార్జుననగర్ కాలనీ సమీపంలోని శ్రీనివాస వైన్స్ షట్టర్‌ను పైకి లేపిన దుండగులకు గ్రిల్స్ అడ్డుగా ఉండటంతో పైకప్పు రేకులను తొలగించుకొని లోపలికి ప్రవేశించారు. అందులో విలువైన మద్యం సీసాలు ఉన్నప్పటికి వాటికి జోలికి వెళ్లలేదు.

అక్కడ నుంచి పక్కనే ఉన్న యునెటైడ్ బుల్స్ బట్టల దుకాణం షట్టర్‌ను అదే రీతిలో పెకైత్తారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ:10 వేల నగదుతో పాటుగా పదివేల విలువ చేసే జీన్స్‌ప్యాంట్లను ఎత్తుకెళ్లారు. తరువాత పక్కనే ఉన్న విహశ్రీ రైస్‌డిపో, రవీంద్రా మెడికల్ హాల్ షట్టర్‌లను పెకైత్తేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలిసిన క్రైం పోలీసులు, క్లూస్‌టీంతో గురువారం ఉదయం ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించడంతో పాటుగా ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను సేకరించారు.

Advertisement

పోల్

Advertisement