breaking news
cash counter
-
ఆదిలాబాద్: బ్యాంకు సిబ్బందికి షాకిచ్చిన దొంగ
నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్‌రూం తాళం యమా స్ట్రాంగ్‌గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్‌పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. ముసుగు వేసుకుని గురువారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్‌పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్‌ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్‌తో రాశాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్‌ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
నాలుగు దుకాణాల్లో వరుస చోరీలు
కుషాయిగూడ: తాళం వేసిన నాలుగు షాపుల్లో దుండగులు ఒకేసారి దొంగతనానికి పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈసీఐఎల్- చక్రిపురం చౌరస్తాల మధ్య బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మొదట నాగార్జుననగర్ కాలనీ సమీపంలోని శ్రీనివాస వైన్స్ షట్టర్‌ను పైకి లేపిన దుండగులకు గ్రిల్స్ అడ్డుగా ఉండటంతో పైకప్పు రేకులను తొలగించుకొని లోపలికి ప్రవేశించారు. అందులో విలువైన మద్యం సీసాలు ఉన్నప్పటికి వాటికి జోలికి వెళ్లలేదు. అక్కడ నుంచి పక్కనే ఉన్న యునెటైడ్ బుల్స్ బట్టల దుకాణం షట్టర్‌ను అదే రీతిలో పెకైత్తారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ:10 వేల నగదుతో పాటుగా పదివేల విలువ చేసే జీన్స్‌ప్యాంట్లను ఎత్తుకెళ్లారు. తరువాత పక్కనే ఉన్న విహశ్రీ రైస్‌డిపో, రవీంద్రా మెడికల్ హాల్ షట్టర్లను పెకైత్తేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలిసిన క్రైం పోలీసులు, క్లూస్‌టీంతో గురువారం ఉదయం ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించడంతో పాటుగా ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను సేకరించారు.