స్వల్ప లాభాల్లోముగిసిన మార్కెట్లు | Sensex Gains For Fourth Day, Nifty Settles Above 8,800 | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sep 19 2016 4:03 PM | Updated on Sep 4 2017 2:08 PM

ఆసియా మార్కెట్ల పాజిటివ్ సంకేతాలు, మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల ధోరణితో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగాశాయి.

ముంబై:  ఆసియా మార్కెట్ల  పాజిటివ్  సంకేతాలు, మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల ధోరణితో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగాశాయి.  ప్రారంభంనుంచీ  ఊగిసలాటల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరికి  వరుసగా నాలుగోరోజూకూడా  లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో  28, 634దగ్గర, 29 పాయింట్లలాభంతో  నిఫ్టీ 8,808 వద్ద క్లోజ్ అయ్యాయి.  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో   కొనుగోళ్ల జోరు కొనసాగింది.  దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్తాయి 8,800కి పైన స్థిరంగా ముగిసింది.  ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రియల్టీ,ఫార్మా షేర్లకొనుగోళ్ల వైపు ఆసక్తి నెలకొంది. ఇండస్ ఇండ్, అరబిందో ఫార్మా, ఐసీఐసీఐ, టీసీఎస్, హెరిటేజ్ ఫుడ్స్   లాభపడగా,  మారుతి సుజుకి,  బజాజ్ ఆటో, భారతి ఎయిర్ టెల్, హీరో మోటార్ కార్పొ, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.
అటు డాలర్ మారకపు విలువలో రూపాయి 0.03 పైసల లాభంతో66.95 ఉంది.  ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా.90 రూపాయల లాభంతో  30,903 వద్ద ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement