25 వేల పాయింట్ల దిగువకు పడిన సెన్సెక్స్ | sensex ends below 25 thousand points for first in 14 months | Sakshi
Sakshi News home page

25 వేల పాయింట్ల దిగువకు పడిన సెన్సెక్స్

Sep 7 2015 3:49 PM | Updated on Nov 9 2018 5:30 PM

25 వేల పాయింట్ల దిగువకు పడిన సెన్సెక్స్ - Sakshi

25 వేల పాయింట్ల దిగువకు పడిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. గడిచిన 14 నెలల్లో ఎప్పుడూ లేనట్లుగా సెన్సెక్స్ ఏకంగా 25 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. గడిచిన 14 నెలల్లో ఎప్పుడూ లేనట్లుగా సెన్సెక్స్ ఏకంగా 25 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఒక దశలో 329 పాయింట్లు నష్టపోయి 24,872.58 వద్దకు చేరుకున్నా, తర్వాత కొద్దిగా కోలుకుని.. 308 పాయింట్ల నష్టంతో 24,893.81 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది. 96 పాయింట్లు నష్టపోయి 7558.80 వద్ద ముగిసింది.

గత వారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోనే ట్రేడయిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి మార్కెట్లలో ప్రధానంగా ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీహెచ్ఈఎల్ తదితర షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం తదితర షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement