వర్చువల్‌ విశ్వాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు | Scientists conjure up largest virtual universe | Sakshi
Sakshi News home page

వర్చువల్‌ విశ్వాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు

Jun 12 2017 1:43 PM | Updated on Sep 5 2017 1:26 PM

అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని(డార్క్‌ మ్యాటర్‌) ఛేదించెందుకు శాస్త్రవ్తేత్తలు వర్చువల్‌ విశ్వాన్ని సృష్టించారు.

జెనివా: అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని(డార్క్‌ మ్యాటర్‌) ఛేదించెందుకు శాస్త్రవ్తేత్తలు వర్చువల్‌ విశ్వాన్ని సృష్టించారు. దీనిని 2020లో ప్రయోగించనున్న ఎక్యూలిడ్‌ ఉపగ్రహంలో అమర్చనున్నారు. పీకేడీజీఆర్‌ఏవి3 కోడ్‌ను ఉపయోగించి 80 గంటల్లో దీనిని సృష్టించామని పరిశోధకులు తెలిపారు. విశ్వంలో 95శాతం కృష్ణ పదార్థం ఉందని దానిని శోధించడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నామని వారు తెలిపారు.

కృష్ణ పదార్థం ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉందని యూజీహెచ్‌కు చెందిన ప్రొఫెసర్‌ రోమెన్‌ టెసియర్‌ తెలిపారు. ఎక్యూలిడ్‌ 1000 కోట్ల సంవత్సరాల నాటి పరిస్థితులను అంచనా వేయనుందని జోచిమ్‌ స్టడిల్‌ అన్నారు. ఎక్యూలిడ్‌ ఉపగ్రహం ద్వారా కృష్ణ పదార్థం వివరాలతో పాటు కొత్త కణాలు, విశ్వాల వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement