సంఘ్‌ శక్తులే ఉగ్రవాదులని ఒప్పుకున్నారు | sangh pariwar is the only terrorist, not all hindus; diggi on anil vij | Sakshi
Sakshi News home page

సంఘ్‌ శక్తులే ఉగ్రవాదులని ఒప్పుకున్నారు

Jun 21 2017 8:52 PM | Updated on Sep 5 2017 2:08 PM

సంఘ్‌ శక్తులే ఉగ్రవాదులని ఒప్పుకున్నారు

సంఘ్‌ శక్తులే ఉగ్రవాదులని ఒప్పుకున్నారు

ఉగ్రదాడులకు పాల్పడేది ముస్లింలేనని, హిందువుల్లో ఉగ్రవాదులు ఉండరన్న బీజేపీ(హరియాణ) మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు.

- బీజేపీ మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాఖ్యలకు దిగ్విజయ్‌ కౌంటర్‌
న్యూఢిల్లీ: ఉగ్రదాడులకు పాల్పడేది ముస్లింలేనని, హిందువుల్లో ఉగ్రవాదులు ఉండరన్న బీజేపీ(హరియాణ) మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు.

సంఘ్‌పరివార్‌ ఉగ్రవాద సంస్థే అన్న నిజాన్ని అనిల్‌ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపించారని దిగ్విజయ్‌ అన్నారు. ‘పరివార్‌ ఉగ్రద సంస్థని ఆయన(అనిల్‌ విజ్‌) అధికారికంగా ప్రకటించుకున్నారు. మేం(కాంగ్రెస్‌) చెబుతున్నది కూడా అదే. హిందువులు ఉగ్రవాదులు కారు.. సంఘ్‌ శక్తులు మాత్రమే టెర్రరిస్టులు’ అని దిగ్విజయ్‌ వ్యాఖ్యానించారు.

హరియాణ మంత్రి అనిల్‌ విజ్‌ బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్నది ముస్లింలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement