బీస్ట్ మోడ్ తో ఎస్-8! | Samsung to realease s-8 in 2017 march | Sakshi
Sakshi News home page

బీస్ట్ మోడ్ తో ఎస్-8!

Dec 26 2016 5:09 PM | Updated on Sep 4 2017 11:39 PM

బీస్ట్ మోడ్ తో ఎస్-8!

బీస్ట్ మోడ్ తో ఎస్-8!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ శామ్‌సంగ్‌ నుంచి సరికొత్త పరిజ్ఞానంతో ఎస్-8 రానుంది.

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ శామ్‌సంగ్‌ నుంచి సరికొత్త పరిజ్ఞానంతో ఎస్-8 రానుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఎస్‌8ను శాంసంగ్ విడుదల చేస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ సమయానికి ఎస్‌8 మొబైల్‌ విడుదల కాదని తెలిసింది. బ్యాటరీ లోపాలతో నోట్‌7 మొబైల్‌ ఫోన్లు పేలిపోవడంతో సంస్థ గెలాక్సీ ఎస్‌8పై శాంసంగ్ ప్రత్యేక దృష్టి సారించిందట. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
 
ఫిబ్రవరి 27, 2017 నుంచి మార్చి 2 వరకు మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ జరగనుంది. అయితే ఎస్‌8ను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు శామ్‌సంగ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఫోన్‌లో 'బీస్ట్'మోడ్‌ను అందుబాటులోకి తీసుకురానుందట. దీనివల్ల ప్రాసెసర్‌ వేగం పెరగడంతో పాటు, మొబైల్‌ మెమొరీ సామర్థ్యం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎస్‌8 8 జీబీ ర్యామ్‌ను కలిగి, డ్యుయల్‌ కెమెరాతో రానున్నట్లు పలు టెక్నాలజీ సైట్లు పేర్కొన్నాయి. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఓఎస్‌తో పనిచేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement