మెమరీకార్డుల కాలం పోయినట్లే! | Samsung Launches World's First Universal Flash Storage Cards | Sakshi
Sakshi News home page

మెమరీకార్డుల కాలం పోయినట్లే!

Jul 9 2016 10:49 AM | Updated on Sep 4 2017 4:29 AM

స్మార్ట్ ఫోన్లు ప్రారంభమైన దగ్గర నుంచి అప్ గ్రేడ్ కు నోచుకోని ఒకే ఒక్కటి మెమరీ కార్డు.

స్మార్ట్ ఫోన్లు ప్రారంభమైన దగ్గర నుంచి అప్ గ్రేడ్ కు నోచుకోని ఒకే ఒక్కటి మెమరీ కార్డు. కొత్త కొత్తగా ఎన్నో టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చినా మెమరీ కార్డు పద్దతిని మాత్రం మార్చలేకపోయాయి. తాజాగా మొబైల్ కంపెనీ దిగ్గజం శాంసంగ్ మెమరీ కార్డుల స్థానాన్ని భర్తీ చేసి వాటి కంటే మూడు రెట్లు వేగంగా పనిచేసే 'యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్(యూఎఫ్ఎస్)'ను అందుబాటులోకి తెచ్చింది.

32 జీబీ కెపాసిటీతో ప్రారంభంమయ్యే వీటి రేంజ్ 64,128,256 జీబీల సామర్ధ్యంతో త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. యూఎఫ్ఎస్ కెపాసిటీ పెరిగే కొద్దీ డేటాను కాపీ చేయడం, ట్రాన్స్ ఫర్ చేయడం లేదా డేటాను ఓపెన్ చేయడం వంటివి అత్యంత వేగంగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం 10 సెకన్లలో 5జీబీ సైజులో ఉన్న సినిమాను ఇవి రీడ్ చేయగలవని, సాధారణ మెమరీ కార్డులు ఇదే సినిమాను రీడ్ చేయడానికి 50 సెకన్ల సమయం తీసుకుంటాయని తెలిపారు.

ఎక్కువ మెమరీ అవసరమయ్యే డీఎస్ఎల్ఆర్ కెమెరాలు, డ్రోన్లు, 3డీ వీఆర్ కెమెరాలు, యాక్షన్ కెమెరాల్లో ఇవి మరింత శక్తిమంతంగా పనిచేస్తాయని వివరించారు. కాగా, శాంసంగ్ వీటి ధర, విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement