అభిమానుల్లో నిరాశ పోగొట్టిన సమంత.. | Samantha Poster attracts Fans | Sakshi
Sakshi News home page

అభిమానుల్లో నిరాశ పోగొట్టిన సమంత..

Jun 29 2016 4:48 PM | Updated on Sep 4 2017 3:43 AM

అభిమానుల్లో నిరాశ పోగొట్టిన సమంత..

అభిమానుల్లో నిరాశ పోగొట్టిన సమంత..

అమె అందంలో ఛేంజ్ వచ్చేసిందంటూ నిరాశ పడ్డ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది సమంత. జూన్ నెలలో వెలువడ్డ ఓ సినీ మ్యాగజిన్ పై కనిపించిన పోస్టర్.. అభిమానును కట్టిపడేసింది.

అమె అందంలో ఛేంజ్ వచ్చేసిందంటూ నిరాశ పడ్డ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది సమంత. జూన్ నెలలో వెలువడ్డ ఓ సినీ మ్యాగజిన్ పై కనిపించిన పోస్టర్.. అభిమానులను కట్టిపడేసింది. అందానికి మరోపేరు సమంత అనేట్లుగా... నిండైన వస్త్రధారణ, బంగారు వన్నెలొలికించే సంప్రదాయ పట్టుచీరతో అందర్నీ ఆకట్టుకుంది. సమంతలో ఛార్మ్ తగ్గిందేమో అన్న అనుమానాలకు చెక్ పెట్టేసింది.

ఆరేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూ... తన అద్భుతమైన నటనతో ఎందరో హీరోయిన్లను దాటేసి నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది సమంత. అందంలో మిగిలిన వారితో పోలిస్తే కాస్త వెనుకబడ్డా.. నటనతో పోటీపడి వారందరికీ దీటుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే లుక్స్ తో అద్భుతమైన నటనతో ఈగ, బృందావనం వంటి సినిమాల్లో ఆమె రూపం సైతం అందర్నీ కట్టి పడేసింది. అయితే ఆ తర్వాత ఆమెలో వచ్చిన ఛేంజ్ ను, తగ్గిన ఛార్మ్ ను చూసి అభిమానులు దిగాలు పడిపోయారు. అప్పట్లో ఆమెకు స్కిన్ ఎలర్జీ వచ్చిందని, అదే ఆమె అందాన్ని దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. అయితే చక్కనమ్మ చిక్కినా అందమే... సన్నబట్ట నలిగినా అందమే అన్న సామెతకు సంమత సరిగ్గా సరిపోతుందని ఇటీవల వెలువడిన 'గలాటా సినిమా' మ్యాగజిన్ నిరూపించింది. ఆ పుస్తకం కవర్ పేజీ మీద కనిపించిన పోస్టర్ చూస్తే ఆమె అందం తరిగేదికాదని అర్థమౌతుంది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 సినిమాలో సమంతలో ఏదో లోపం ఉందంటూ అభిమానులు నిరాశ పడ్డారు. కానీ ఫేస్ లో కాస్త గ్లో తగ్గినా  తన నటనతో ఆఫీలింగ్ నుంచి వారిని బయట పడేయగలిగింది అయితే ఇప్పుడు తాజాగా వెలువడిన గలాటా సినిమా మ్యాగజిన్ లో అటువంటి అనుమానాలకు పూర్తిగా చెక్ పెట్టేసింది ఆ చెన్నై సుందరి. సౌత్ ఇండియన్ మూవీ మ్యాగజిన్ కవర్ పేజ్ పై బంగారు బొమ్మలాంటి రూపంలో ప్రత్యక్షమైన సమంత.. తనలో అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. మ్యాగజిన్ పోస్టర్ పై గోల్డెన్ డామినేటెడ్ జరీ బోర్డర్ సంప్రదాయ పట్టుచీరకు తోడు.. నిండైన డిజైనర్ బ్లౌజ్.. ఆమె అందాన్ని మరింత ఇనుమడింజేసింది. అంతేకాదు 'గలాటా సినిమా' జూన్ 2016 మ్యాగజిన్ కోసం తీసిన ప్రత్యేక ఫోటో షూట్ కు సంబంధించిన చిత్రాల్లోనూ ఆమె అందం కళ్ళు తిప్పుకోకుండా చేస్తోంది. సంమంత నిజంగా గ్లామరస్ బ్యూటీ క్వీన్ అని మరోమారు రుజువు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement