యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ | sachinTendulkar becomes UNICEF's brand ambassador for South Asia | Sakshi
Sakshi News home page

యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్

Nov 28 2013 7:24 PM | Updated on Sep 2 2017 1:04 AM

యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్

యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్

యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు.

ముంబై: యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. దక్షిణాసియా విభాగానికి సచిన్ ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు యూనిసెఫ్ గురువారం ప్రకటించింది. పిల్లల హక్కులతో పాటు వారి పౌష్టికాహారం అంశాలపై ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి సెలబ్రిటీలు ఎంపిక కాగా, ఈ సంవత్సరం భారత్ నుంచి  సచిన్ ఎంపికయ్యాడు. యూనిసెఫ్ తరుపున రెండు సంవత్సరాల పాటు సేవలు అందించేందుకు సచిన్ సన్నద్ధమయ్యాడు. తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్ కెరీర్ను ముగించిన అనంతరం తన రెండో ఇన్నింగ్స్ నుఈ రకంగా ఆరంభించడం చాలా ఆనందంగా ఉందన్నాడు.

 

దేశంలోని 36 శాతం మంది సురక్షితమైన మరుగుదొడ్లు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. సామాన్యునికి కనీస అవసరమైన మరుగుదొడ్లపై సరైన అవగాహన లేకపోవడం  చాలా బాధాకరమన్నాడు. ఈ అంశాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టతరమైందిగా పేర్కొన్నాడు. శక్తి సామర్థ్యల మేర తనకు లభించిన ఈ అవకాశానికి వంద శాతం న్యాయం చేస్తానని సచిన్ తెలిపాడు

చాలా కుటుంబాల్లో పిల్లల అవసరాల్ని తీర్చడంలో తల్లి కీలక పాత్ర పోషింస్తుదన్నాడు. పిల్లల విసర్జించిన మల మూత్రాల గురించి దేశంలోని చాలా మంది తల్లులకు సరైన అవగాహన లేక వారి ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందన్నాడు. పిల్లల మల మూత్రాలను తీసివేసిన అనంతరం తల్లులు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని అందించకూడదన్నాడు. చిన్నారులు బంగారు భవిత ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్లే భారంగా మారుతుందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రకరకాల వ్యాధులతో ప్రతీరోజూ 1600 పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని మాస్టర్ తెలిపాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement