రూ. కోటి కారులో కరువు పర్యటన! | Sakshi
Sakshi News home page

రూ. కోటి కారులో కరువు పర్యటన!

Published Sun, Apr 17 2016 1:21 AM

రూ. కోటి కారులో కరువు పర్యటన! - Sakshi

యడ్యూరప్ప తీరు వివాదాస్పదం

 

బెంగళూరు: కర్ణాటక బీజేపీ చీఫ్‌గా ఇటీవల పగ్గాలు చేపట్టిన బీఎస్ యడ్యూరప్ప వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ మంత్రి, తన విధేయుడు, వ్యాపారవేత్త మురేగేశ్ నిరానీ రూ.1.15కోట్ల ఖరీదైన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని ఇవ్వడంపై  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికే నిరానీ తనకు కారు ఇచ్చారని,  పార్టీ చీఫ్‌గా రెండేళ్ల పదవీకాలం ముగియగానే తిరిగి తీసుకుంటారని యడ్యూరప్ప శనివారం చెప్పారు. 73 ఏళ్ల యడ్యూరప్ప రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఖరీదైన కారును సమకూర్చానని నిరానీ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement