సిలికాన్ వ్యాలీలో పోటీకి ఖన్నా సై | Ro Khanna launches second bid to enter US Congress | Sakshi
Sakshi News home page

సిలికాన్ వ్యాలీలో పోటీకి ఖన్నా సై

Jun 2 2015 8:59 AM | Updated on Sep 3 2017 3:07 AM

సిలికాన్ వ్యాలీలో పోటీకి ఖన్నా సై

సిలికాన్ వ్యాలీలో పోటీకి ఖన్నా సై

యువ భారత-అమెరికన్ రొ ఖన్నా మరోసారి అమెరికా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

వాషింగ్టన్: యువ భారత-అమెరికన్ రోహిత్ ఖన్నా(రొ ఖన్నా) మరోసారి అమెరికా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 2016 ఎన్నికల్లో ఇక్కడి నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

2014 ఎన్నికల్లో సిలికాన్ వ్యాలీ నుంచి పోటీ చేయాలని భావించినా స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయారు. పోటీ బిడ్ లో డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నాయకుడు మైక్ హొండా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఖన్నా రెడీ అవుతున్నారు. మైక్ హొండా కూడా మళ్లీ సిలీకాన్ వ్యాలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ప్రతినిధుల సభకు పోటీ చేసే అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement