రాజ్యసభకు హాజరైన నటి రేఖ | Rekha makes appearance in Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు హాజరైన నటి రేఖ

Aug 12 2014 3:09 PM | Updated on Sep 15 2018 8:03 PM

రాజ్యసభకు హాజరైన నటి రేఖ - Sakshi

రాజ్యసభకు హాజరైన నటి రేఖ

ప్రముఖ నటి రేఖ మంగళవారం రాజ్యసభకు హాజరైయ్యారు.

న్యూఢిల్లీ:ప్రముఖ నటి రేఖ మంగళవారం రాజ్యసభకు హాజరైయ్యారు. ఈ సీజన్ లో ఆమె రాజ్యసభకు హాజరు కావడం ఇదే తొలిసారి. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో రేఖ వాటికి తెరదించుతూ ఈ రోజు రాజ్యసభలో అడుగుపెట్టారు. గోల్డెన్ సిల్క్ శారీ ధరించిన ఆమె.. సామాజిక కార్యకర్త అను అగా ప్రక్కసీట్లో కూర్చున్నారు. కాసేపు మాత్రమే సభలో ఉన్న వారిద్దరూ లంచ్ సమయానికి ముందే సభ నుంచి వెళ్లిపోయారు.

 

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అలనాటి సినీనటి రేఖ ఇద్దరూ రాజ్యసభకు హాజరు కాకపోవడంతో సభలో కొన్ని రోజుల క్రితం వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ 2012 సంవత్సరంలోనే రాజ్యసభ సభ్యులగా నియమితులైయ్యారు. అయితే, 2014 సంవత్సరం మొదలైన తర్వాత ఒక్కసారి కూడా వాళ్లిద్దరూ సభకు హాజరు కాలేదు.  గత సంవత్సరం క్రికెట్ నుంచి కూడా రిటైరైపోయిన సచిన్ టెండూల్కర్ కేవలం మూడు రోజులే సభకు వస్తే, సీనియర్ నటీమణి రేఖ ఏడు రోజులు మాత్రమే ముఖం చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement