రాజకీయ ఎన్నికల బరిలో మరో సినీ నటుడు నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు
ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న సినీ నటుడు!
Jan 3 2014 3:25 PM | Updated on Mar 18 2019 9:02 PM
మరో సినీ నటుడు రాజకీయ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భోజ్ పూరి నటుడు రవి కిషన్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని స్వంత జిల్లా జాన్ పూర్ లో ఎన్నికల్లో పోటి చేసేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన రక్తంలోనే కాంగ్రెస్ ఉంది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించే విషయంలో సానుకూలంగా స్పందింస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే తనతో ఇతర పార్టీల వారు కూడా తనతో టచ్ లో ఉన్నారని, కాని తాను కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నాను అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాలీవుడ్ చిత్రాలు ఫిర్ హెరా ఫెరీ, ఏజెంట్ వినోద్, బుల్లెట్ రాజాతోపాటు పలు భోజ్ పూరి చిత్రాల్లో రవి కిషన్ నటించారు.
Advertisement
Advertisement