యూపీలో మేం గెలిచి తీరుతాం | rammadhav comment on up elections | Sakshi
Sakshi News home page

యూపీలో మేం గెలిచి తీరుతాం

Feb 3 2017 2:24 PM | Updated on Mar 29 2019 9:31 PM

అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాంమాధవ్‌ ధీమా వ్యక్తం చేశారు.

  • ‘సాక్షి’టీవీతో బీజేపీ అధికార ప్రతినిధి రాంమాధవ్‌
  • న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాంమాధవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ‘సాక్షి’టీవీతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి నినాదంతోనే యూపీ ఎన్నికల్లో తమ అజెండా తెలిపారు. రామమందిరం నిర్మాణం విషయంలో బీజేపీపై ఆరోపణలు చేయడం అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం కట్టాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు.

    గోవా, ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదని, నల్లధనాన్ని వెలికితీయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement