అత్యాచార ఆరోపణలతో రాజస్థాన్ మంత్రి రాజీనామా | Rajasthan Minister Babulal Nagar accused in rape case resigns | Sakshi
Sakshi News home page

అత్యాచార ఆరోపణలతో రాజస్థాన్ మంత్రి రాజీనామా

Sep 19 2013 1:22 PM | Updated on Oct 4 2018 8:38 PM

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి బాబూలాల్ నగర్(53) తన పదవికి రాజీనామా చేశారు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి బాబూలాల్ నగర్(53) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. 35 ఏళ్ల మహిళపై ఆయన అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. నైతిక బాధ్యతగా రాజీనామా చేశానని బాబూలాల్ తెలిపారు.

దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో పదవిని వదులుకున్నట్టు చెప్పారు. తన ఎటువంటి నేరం చేయలేదని ఆయన అన్నారు. అయితే తనను రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదని వెల్లడించారు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి ఈనెల 11న తన అధికార నివాసంలో బాధిత మహిళపై బాబూలాల్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ నిన్న దర్యాప్తు ప్రారంభించింది. ఏ క్షణంలోనైనా బాబూలాల్ ను అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement