రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన | rahul gandhi visits tomorrow in hudhud cyclone affected ares | Sakshi
Sakshi News home page

రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన

Oct 18 2014 5:41 PM | Updated on Sep 2 2017 3:03 PM

హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం పర్యటించనున్నారు.

విశాఖ:హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం పర్యటించనున్నారు. ఆ రోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు.  ఉదయం 11 గం.లకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో , 12 గం.లకు తాటిచెట్లపాలెంలో రాహుల్ బాధితులను పరామర్శిస్తారు.  అదే రోజు మధ్యాహ్నం 1 గం.కు విజయనగరం జిల్లా చేరుకుని కొవ్వులవాడలో పర్యటిస్తారు. అనంతరం ఏడు గంటలకు ఏడుగుళ్లలో తుపాను బాధితులను రాహుల్ కలుసుకుంటారు. గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తరువాత వెయ్యి కోట్ల రూపాయలను తక్షణ సాయం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement