రిటైర్మెంట్‌: 60 నుంచి 58కి కుదింపు! | Punjab government reduces retirement age | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌: 60 నుంచి 58కి కుదింపు!

Jul 23 2017 11:03 AM | Updated on Sep 5 2017 4:43 PM

రిటైర్మెంట్‌: 60 నుంచి 58కి కుదింపు!

రిటైర్మెంట్‌: 60 నుంచి 58కి కుదింపు!

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వరకు కుదించాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

లుథియానా: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వరకు కుదించాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌-బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల పొడిగింపును ఇస్తూ రిటర్మెంట్‌ వయస్సును 60 ఏళ్లకు పెంచింది. అయితే, తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పొడిగింపును కొనసాగించకూడదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం.. 58 ఏళ్లు నిండి రెండేళ్ల కొనసాగింపులో ఉన్న ఉద్యోగులందరినీ ఈ నెల 31లోగా రిలీవ్‌ చేయాలని నిర్ణయించారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 2,500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా జీతభత్యాలరూపంలో ఏటా రూ. 750 కోట్ల భారం ఖజానాపై తగ్గనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement