ప్రముఖ నిర్మాత కన్నుమూత! | Producer Cum Distributor Jain Raj Passes Away! | Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Jun 17 2017 8:30 PM | Updated on Sep 5 2017 1:52 PM

తమిళచిత్ర నిర్మాత జైన్‌రాజ్‌ శనివారం ఉదయం కన్నుమూశారు.

తమిళసినిమా: తమిళచిత్ర నిర్మాత జైన్‌రాజ్‌ శనివారం కన్నుమూశారు. చెన్నైకి చెందిన జైన్‌రాజ్‌ పలు చిత్రాలను నిర్మించారు. ఎన్నో సినిమాలకు డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించారు.  అర్జున్‌-రజిత జంటగా ఆయన ‘జైహింద్‌’ సినిమాను తెరకెక్కించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిను తమిళంలో పంపిణీ చేశారు. అదేవిధంగా సంతానం హీరోగా నటించిన దిల్లుక్కు దుడ్డు, జయం రవి కథానాయకుడిగా నటించిన సకలకళావల్లవన్, విజయ్‌ సేతుపతి నటించిన ఆండవన్‌కట్టళై చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశారు. 

అనేక చిత్రాలకు ఫైనాన్సియర్‌గా వ్యవహరించారు. స్థానిక ఆల్వార్‌పేటలో నివసిస్తున్న జైన్‌రాజ్‌ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. జైన్‌రాజ్‌ భౌతిక కాయానికి నటుడు విక్రమ్‌ప్రభు, నిర్మాత టి.శివ, కేఎస్‌.శ్రీనివాసన్, హెచ్‌. మురళి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. జైన్‌రాజ్‌ పార్థివ దేహానికి శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement