నగ్నంగా ఫొటోలకు పోజిచ్చిన గాయని! | Pregnant singer Christina Aguilera shoots nude | Sakshi
Sakshi News home page

నగ్నంగా ఫొటోలకు పోజిచ్చిన గాయని!

Aug 2 2014 8:22 PM | Updated on Sep 2 2017 11:17 AM

నగ్నంగా ఫొటోలకు పోజిచ్చిన గాయని!

నగ్నంగా ఫొటోలకు పోజిచ్చిన గాయని!

రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న గాయని క్రిస్టినా ఆగిలెరా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చింది.

రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న గాయని క్రిస్టినా ఆగిలెరా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చింది. 33 ఏళ్ల ఈ గాయనికి ఈసారి ఆడపిల్ల పుడుతుందని చెబుతున్నారు. తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపించడానికి ఆమె పూర్తి నగ్నంగా మారి 'వి' మ్యాగజైన్కు ఫొటో పోజులు ఇచ్చినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ఆ వెబ్సైటే ఆమె ఫొటోలను విడుదల చేసింది. తెల్లటి బ్యాక్గ్రౌండ్లో పూర్తి బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఈ ఫొటోను సదరు వెబ్సైట్ ప్రచురించింది.

అయితే.. నగ్నత్వంలో కూడా ఎలాంటి అసభ్యత లేకుండా ఈ ఫొటో ఉండటం గమనార్హం. ఎందుకిలా నగ్నంగా ఫొటో తీయించుకున్నారని అడిగితే.. ''నేనో మహిళను. నా జీవితంలోని ప్రతి దశలో నా శరీరం పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఏమాత్రం భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను'' అని చెప్పింది. ఈ నెలలోనే ఆగిలెరా, ఆమె భర్త మాథ్యూ రట్లర్ (28) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆగిరెలాకు ఇప్పటికే తన మాజీ భర్త జోర్డాన్ బ్రట్మన్తో ఆరేళ్ల కొడుకు మాక్స్ ఉన్నాడు. 2008లో మాక్స్ పుట్టడానికి ముందు కూడా ఆమె ఇలాగే దుస్తులు విప్పి నగ్నంగా ఫొటోలు తీయించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement