ఇండోనేసియాలో భారీ భూకంపం | Powerful quake hits Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో భారీ భూకంపం

Jul 28 2015 8:26 AM | Updated on Sep 3 2017 6:20 AM

ఇండోనేసియాలో భారీ భూకంపం

ఇండోనేసియాలో భారీ భూకంపం

ఇండోనేసియాలోని పశ్చిమ ప్రాంతంలోని పవువా ప్రావిన్స్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

జకార్తా : ఇండోనేసియాలోని పశ్చిమ ప్రాంతంలోని పవువా ప్రావిన్స్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదు అయింది. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. పవువాకు 75 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.

భూకంపం సంభవించిన ప్రాంతాలలో భయంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు మీడియా వివరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement