రానున్న బడ్జెట్లో ఖర్చును నియంత్రించేందుకు చేపట్టవలసిన చర్యలపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది.
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో ఖర్చును నియంత్రించేందుకు చేపట్టవలసిన చర్యలపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఖర్చులో మరింత కోత పెడతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఖర్చులను హేతుబద్దీకరిస్తామని ఆయన వెల్లడించారు. బడ్జెట్ లో విద్యుత్, పోర్టులు, రైల్వే రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అఆగే మౌలిక సదుపాయాల అభివృద్దికి మరిన్ని నిధులు వెచ్చిస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు.