breaking news
finance budget
-
నేటి నుంచి బడ్జెట్ కసరత్తు షురూ..
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సానికి (2023–24) సంబంధించిన బడ్జెట్‌పై నేటి నుంచి (సోమవారం) కేంద్రం కసరత్తు మొదలుపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు (ఆర్ఈ), రాబోయే సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు తదితర అంశాలపై వివిధ శాఖలు, విభాగాలతో సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి రోజైన సోమవారం నాడు అటవీ శాఖ, కార్మిక శాఖ, సమాచార .. ప్రసార శాఖ, గణాంకాల శాఖ, యువజన వ్యవహారాల శాఖ ఆర్ఈ సమావేశాలు ఉంటాయి. వివిధ శాఖలతో నెల రోజుల పాటు సాగే సమావేశాలు నవంబర్ 10న ముగుస్తాయి. సాధారణంగా ఈ సమావేశాలన్నింటికి ఆర్థిక విభాగం, వ్యయాల విభాగం కార్యదర్శులు సారథ్యం వహిస్తారు. ప్రీ–బడ్జెట్ భేటీల తర్వాత 2023–24 బడ్జెట్ అంచనాలను సూచనప్రాయంగా రూపొందిస్తారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే చర్యలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
'విద్యుత్, పోర్టులు, రైల్వేలకు అధిక ప్రాధాన్యత'
న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్లో ఖర్చును నియంత్రించేందుకు చేపట్టవలసిన చర్యలపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఖర్చులో మరింత కోత పెడతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఖర్చులను హేతుబద్దీకరిస్తామని ఆయన వెల్లడించారు. బడ్జెట్ లో విద్యుత్, పోర్టులు, రైల్వే రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అఆగే మౌలిక సదుపాయాల అభివృద్దికి మరిన్ని నిధులు వెచ్చిస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు.