ఫార్మా రంగానికి సంబంధించి ఫార్మాక్ ఇండియా 2013 నాలుగో ఎక్స్‌పోకి హైదరాబాద్ వేదిక కాబోతోంది.
హైదరాబాద్: ఫార్మా రంగానికి సంబంధించి ఫార్మాక్ ఇండియా 2013 నాలుగో ఎక్స్‌పోకి హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఈ నెల 5 నుంచి 7 దాకా మూడు రోజుల పాటు దీన్ని నిర్వహించనున్నారు. దాదాపు 100కు పైగా సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఫార్మెక్సిల్, బల్క్ డ్రగ్స్ తయారీ సంస్థల సమాఖ్య బీడీఎంఏ దీన్ని నిర్వహిస్తున్నాయి. ఫార్మా సంస్థలు కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇది తోడ్పడగలదని నిర్వాహకులు తెలిపారు.