సినీ పరిశ్రమలో మరో విషాదం! | Parvathamma Rajkumar, wife of late Kannada actor Rajkumar, dies | Sakshi
Sakshi News home page

సినీ పరిశ్రమలో మరో విషాదం!

May 31 2017 9:06 AM | Updated on Sep 5 2017 12:28 PM

సినీ పరిశ్రమలో మరో విషాదం!

సినీ పరిశ్రమలో మరో విషాదం!

ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకొనగా..

  • లెజండరీ నటుడు రాజ్‌కుమార్‌ సతీమణి కన్నుమూత
  • బెంగళూరు: ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకొనగా.. అటు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ విషాదం నెలకొంది. లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవం రాజ్‌కుమార్‌ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ బుధవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో  ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె  బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు.

    78 ఏళ్ల పార్వతమ్మ ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 14న ఆస్పత్రిలో చేరింది. అప్పటినుంచి వెంటిలేటర్‌ మీద ఉన్న ఆమెకు వైద్యులు ప్రత్యేక శస్త్రచికిత్సలు నిర్వహించినా లాభం లేకపోయింది. పూర్ణ ప్రంగ వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త రాజ్‌కుమార్‌ తరహాలోనే పార్వతమ్మ కూడా తన రెండు కళ్లను దానం చేశారు.


    రాజ్‌కుమార్‌-పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. వీరి తనయులైన పునీత్‌ రాజకుమార్‌, శివరాజ్‌కుమార్‌ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు. నిర్మాతగా కూడా పార్వతమ్మ తనదైన ముద్ర వేశారు. ఆమె అప్పు, అరసు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసుకున్నారు. ఆమె కుటుంబానికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement