ఎంపీల జీతాలను, నియోజకవర్గ, ఆఫీసు అలవెన్సులను 100 శాతం పెంచాలన్న సిఫార్సులపై విమర్శలు చెలరేగడంతో ఎంపీల జీతాలు, అలవెన్సులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పునఃసమీక్షించనుంది.
న్యూఢిల్లీ: ఎంపీల జీతాలను, నియోజకవర్గ, ఆఫీసు అలవెన్సులను 100 శాతం పెంచాలన్న సిఫార్సులపై విమర్శలు చెలరేగడంతో ఎంపీల జీతాలు, అలవెన్సులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పునఃసమీక్షించనుంది. బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చివరిసారిగా ఎంపీల జీతాలను 2010లో పెంచారు. ప్రస్తుతం ఒక్కో ఎంపీ రూ. 50 వేలు జీతంగా, రూ.45 వేలు నియోజకవర్గ అలవెన్సుగా.. రూ.45 వేలు ఆఫీసు అలవెన్సుగా మొత్తం నెలకు రూ.1.4 లక్షలు పొందుతున్నారు. దీనిని రూ. 2.8 లక్షలు చేయాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది. జీతాల పెంపునకు సంబంధించి పలువురు సభ్యులు సూచించిన డిమాండ్లపై పార్లమెంటరీ కమిటీ సానుకూలంగా ఉంది.