తల్లీకూతుళ్లతో సంబంధం.. తల్లి హత్య! | paramour eyes on daughter, murders woman | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లతో సంబంధం.. తల్లి హత్య!

Aug 14 2014 11:28 AM | Updated on Sep 2 2017 11:52 AM

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తర్వాత ఆమె కూతురిపై కన్నేసి, ఆమెను కూడా ముగ్గులోకి దింపి, చివరకు తల్లిని పీకపిసికి చంపేశాడో దుర్మార్గుడు.

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తర్వాత ఆమె కూతురిపై కన్నేసి, ఆమెను కూడా ముగ్గులోకి దింపి, చివరకు తల్లిని పీకపిసికి చంపేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా బిలాస్పూర్ గ్రామంలో జరిగింది. రామ్వీర్ అనే వ్యక్తి ఓ వితంతువుతో సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఆమె 18 ఏళ్ల కుమార్తె మీద కూడా అతడి కన్ను పడింది. నెమ్మదిగా ఆమెను ప్రేమ పేరుతో వలలోకి దించాడు.

ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అయితే తన కూతురు అతడికి కూడా కూతురి వరస అవుతుందని, ఇలా చేయొద్దని ఆమె తల్లి పెళ్లికి నిరాకరించింది. దాంతో అతడు అనుజ్, సతీష్, అర్జున్ అనే ముగ్గురు సహచరులను వెంటబెట్టుకుని, ఆ వితంతువును పీక పిసికి చంపేశాడు. అనంతరం బిలాస్పూర్ గ్రామ సమీపంలో ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై పడేశాడు. ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులు నలుగురినీ అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement