ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా! | panneer selvam to tour along tamilnadu like MGR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!

Feb 22 2017 5:59 PM | Updated on Sep 5 2017 4:21 AM

ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!

ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి బయల్దేరుతున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి బయల్దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ఓపీఎస్ తలపెట్టారు. ఇందుకోసం ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మహీంద్రా జీపును కొంత మార్పు చేర్పులు చేయించుకుని ఆయన రెడీ చేయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే బలపరీక్ష నిర్వహించి, పళని స్వామి నెగ్గినట్లుగా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో పనిచేయడంతో పాటు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వాన్ని స్వయంగా అమ్మే ముఖ్యమంత్రిగా నియమించారు. అయినా ఆమె కుర్చీలో కూర్చోకుండా.. అందులో జయలలిత ఫొటోను మాత్రం ఉంచి, ఆయన పక్కన వేరే కుర్చీలో కూర్చున్న సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వానికి ప్రజల్లో మంచి స్పందన లభించింది. సామాన్య ప్రజలు ఆయన పట్ల ఆదరణ కనబర్చినా, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోలేకపోవడం.. అసెంబ్లీలో పరిణామాలు చకచకా మారిపోవడంతో పన్నీర్ సెల్వం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement