టాప్ 400 వర్సిటీల్లో 5 భారత సంస్థలకు చోటు | Panjab University is best Indian varsity in world's top 400 list | Sakshi
Sakshi News home page

టాప్ 400 వర్సిటీల్లో 5 భారత సంస్థలకు చోటు

Oct 4 2013 1:30 AM | Updated on Sep 1 2017 11:18 PM

ప్రపంచ అత్యున్నత ప్రమాణాలున్న టాప్ 400 వర్సిటీల్లో మనదేశానికి చెందిన పంజాబ్ విశ్వవిద్యాలయం (226-250 గ్రూప్), ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీలు (351-400 గ్రూప్) నిలిచాయి.

 లండన్: ప్రపంచ అత్యున్నత ప్రమాణాలున్న టాప్ 400 వర్సిటీల్లో మనదేశానికి చెందిన పంజాబ్ విశ్వవిద్యాలయం (226-250 గ్రూప్), ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీలు (351-400 గ్రూప్) నిలిచాయి. 2012లో మూడు మాత్రమే ఉన్న ఈ సంఖ్య 2013-14లో ఐదుకు చేరింది. అత్యుత్తమ బోధన, పరిశోధనలు, విజ్ఞానం బదిలీ, అంతర్జాతీయ దృక్కోణం తదితర అంశాలను పరిశీలించిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ (టీహెచ్‌డబ్ల్యూయూఆర్) సంస్థ తాజా జాబితాను ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement