
కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు ... జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబపై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు... జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబపై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు... జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్లో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తమ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ విషయంపై తాము స్పందించబోమని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.