'పాదయాత్ర'తో మక్కా చేరిన పాక్ యువకుడు | Pakistani pilgrim walks 6,387 km for Haj | Sakshi
Sakshi News home page

'పాదయాత్ర'తో మక్కా చేరిన పాక్ యువకుడు

Oct 13 2013 3:12 PM | Updated on Sep 1 2017 11:38 PM

పాకిస్థాన్ జాతీయుడు కర్లజడ్డ కసరత్ రాయ్ (37) దాదాపు 6387 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి మక్కా చేరుకున్నాడని టెలివిజన్ ఛానెల్ అల్ అరేబియా ఆదివారం వెల్లడించింది.

పాకిస్థాన్ జాతీయుడు కర్లజడ్డ కసరత్ రాయ్ (37) దాదాపు 6387 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి మక్కా చేరుకున్నాడని టెలివిజన్ ఛానెల్ అల్ అరేబియా ఆదివారం వెల్లడించింది. ఇరాన్, ఇరాక్, జోర్డాన్ దేశాలను దాటుకుంటూ తన గమ్యస్థానాన్ని పాదయాత్ర ద్వారా చేరుకున్నాడని వివరించింది.

 

ఆదివారం కసరత్ రాయ్ మాట్లాడుతూ... ప్రపంచంలో శాంతి నెలకొనాలనేది తన పాదయాత్ర వెనకు ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ముస్లిం దేశాలన్ని యూరోపియన్ యూనియన్ తరహాలో ఓ సమూహంగా ఏర్పాటు కావాలని ఆయన తన ఆకాంక్షను ఈ సందర్భంగా వెలుబుచ్చారు.

 

తీవ్రవాదం ఏ రూపంలో దాడి చేసిన దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. గతంలో తాను చేసిన పాదయాత్రలను ఈ సందర్బంగా కసరత్ రాయ్ వివరించారు. ఈ ఏడాది జూన్ 7న కరాచీలో తన పాదయాత్ర ప్రారంభమై ఆక్టోబర్ 1న మక్కా చేరుకుందని కసరత్ రాయ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement