2,240 ఫోన్లు కొట్టేశాడు.. | Over 2,200 stolen mobile phones, tablets recovered from duo | Sakshi
Sakshi News home page

2,240 ఫోన్లు కొట్టేశాడు..

Oct 22 2016 4:26 PM | Updated on Sep 4 2017 6:00 PM

తమిళనాడులోని సంచలనాత్మక దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి భారీ ఎత్తున మొబైల్స్, ఇతర పరికరాలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయపర్చింది

చెన్నై:తమిళనాడులోని సంచలనాత్మక దొంగను పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి భారీ ఎత్తున మొబైల్స్, ఇతర పరికరాలు  పట్టుబడడం పోలీసులను సైతం విస్మయపర్చింది. శనివారం ఉదయం ప్రవీణ్ నుంచి పోలీసులు వేల సంఖ్యలో కొట్టేసిన  స్మార్ట్  ఫోన్లను  రికవరీ చేశారు.
వివరాల్లోకి వెళితే  కత్తి  చూపించి  నగదు దోచుకున్నాడనే ఫిర్యాదు ఆధారంగా   ప్రవీణ ఆచూకీకోం గాలిస్తున్న పోలీసులు  పాలవక్కంలోని  పాన్ బ్రోకర్ (వడ్డీ వ్యాపారి) హనుమాన్ని రామ్ ని అరెస్టు చేసి కూపీ లాగారు.  ఈ విచారణ సందర్భంగా సంచలనాత్మక దొంగ ప్రవీణ్ కుమార్ ఆచూకీ తెలిసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే  ప్రవీణ్ ను  అరెస్ట్ చేసిన పోలీసులు భారీ ఎత్తున మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా  ఈస్ట్ కోస్ట్ రోడ్, రాజీవ్ మహాత్మా గాంధీ సాలై ప్రాంతంలో ఒంటరిగా నడుస్తూ వ్యక్తులను కత్తితో బెదిరించి నుంచి నగదు , సెల్ ఫోన్లు దోచుకున్నట్టుగా  నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు.  ఇలా  కొట్టేసిన  ఫోన్లను వడ్డీ వ్యాపారికి విక్రయించేవాడని అంగీకరించాడన్నారు. ఇలా మొత్తం ఐదు కేసులు కుమార్ వ్యతిరేకంగా పెండింగ్లో ఉన్నాయని వారు తెలిపారు అతగాడినుంచి దాదాపు  2,240 స్మార్ట్ ఫోన్లను,10టాబ్లెట్ లను,  లాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  ఇద్దరిపైనా కేసు నమోదు చేసి  రిమాండ్ కు తరలించామని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement