
10 వేల కంటే ఎక్కువ ఉంటే జరిమానా!
రద్దయిన పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ తీసుకురానుంది.
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ తీసుకురానుంది. ఈ నెల 30వ తేదీ తర్వాత వ్యక్తుల వద్ద 10 వేల రూపాయల వరకు మాత్రమే పాతనోట్లను ఉంచుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతకుమించి ఎవరి దగ్గరైనా ఉంటే 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముంది.
పాత నోట్ల రద్దుపై ఆర్డినెన్స్‌లో కేంద్రం ప్రభుత్వం నియమాలను పొందుపరచనుంది. కంపెనీలు, సంస్థల దగ్గర పాతనోట్లను ఉంచుకునే అవకాశం ఉండకపోవచ్చు. గత నెల 8న 500, 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. త్వరలో ఈ గడువు ముగియనుంది.