నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక! | On Nov 7, it was Govt which ‘advised’ RBI to ‘consider’ note ban, got RBI nod the next day | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!

Jan 10 2017 10:55 AM | Updated on Sep 5 2017 12:55 AM

నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!

నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!

పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.

న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే రిజర్వు బ్యాంకు ఒకే చెప్పింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబర్‌ 22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ ఈ విషయం పేర్కొంది.

‘పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్‌ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకుకు కేంద్రం కోరింద’ని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్‌ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో నకిలీ రూ. 500, వెయ్యి రూపాయల చెలామణి పెరగడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది.

కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు(నవంబర్‌ 8) సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్‌ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవనీ చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement