ఫేస్‌బుక్‌పై ఒబామా తీవ్ర విమర్శలు | Obama again hits at Facebook for spreading fake news | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌పై ఒబామా తీవ్ర విమర్శలు

Nov 18 2016 2:57 PM | Updated on Jul 26 2018 5:23 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మరోసారి ఫేస్‌బుక్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మరోసారి ఫేస్‌బుక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్‌లో తప్పుడు వార్తలను ప్రచారం చేశారని మండిపడ్డారు. అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.

ఓటింగ్‌కు ముందు కూడా ఒబామా ఫేస్‌బుక్‌పై విరుచుకుపడ్డారు.  డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున మిచిగాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఒబామా మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటివాటిని నమ్మరాదంటూ విజ్ఞప్తి చేశారు. కాగా మీడియా, సర్వేలు ఊహించనట్టుగా హిల్లరీ క్లింటన్‌ ఓటమి చవిచూడగా, ట్రంప్‌ విజయం సాధించారు. ఒబామా శుక్రవారం మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని, దీన్ని అడ్డుకోలేకపోయామని అన్నారు. ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించడానికి ఫేస్‌బుక్‌ ప్రభావితం చేసిందని విమర్శకులు కూడా నిందించారు. అయితే ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జూకర్‌ బర్గ్‌ మాత్రం ఈ వాదలను ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement