కుక్కల కోసం ఏసీ హోటల్ | Now, a hotel with spa for dogs in Jaipur | Sakshi
Sakshi News home page

కుక్కల కోసం ఏసీ హోటల్

Aug 5 2015 3:27 PM | Updated on Sep 3 2017 6:50 AM

కుక్కల కోసం ఏసీ హోటల్

కుక్కల కోసం ఏసీ హోటల్

ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటారు. పింక్ సిటీ జైపూర్ లో కుక్కలకు ఆ రోజు రానే వచ్చింది.

జైపూర్: ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటారు. పింక్ సిటీ జైపూర్ లో కుక్కలకు ఆ రోజు రానే వచ్చింది. వాటి కోసం ప్రత్యేకంగా ఎయిర్-కండీషన్డ్ హోటల్ పెట్టారు. ఇందులో కుక్కల విడిది కోసం 20 కెన్నెల్స్ లేదా రూములు ఉన్నాయి. అంతేకాదు శునకాల కోసం స్విమ్మింగ్ పూల్, స్పా సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

జాగిలాలను జాలీగా ఉంచేందుకు, వాటిని మన పిల్లలతో సమానంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ హోటల్ పెట్టినట్టు ఇంటర్నేషనల్  డాగ్ బజార్(ఐడీబీ), రాజస్థాన్ కెన్నల్ క్లబ్ గౌరవ కార్యదర్శి వీరేన్ శర్మ తెలిపారు.  ఒక్కొక్కటి 24 చదరపు అడుగుల విస్తీర్ణంతో 20 ఎయిర్ కండీషన్డ్  కెన్నెల్స్ లేదా రూములతో హోటల్ ప్రారంభించామని చెప్పారు. కుక్కల యజమానుల నుంచి మంచి స్పందన వస్తే వీటి సంఖ్య పెంచుతామన్నారు.

ఒక్క రోజుకు రూ.599 వసూలు చేస్తామని చెప్పారు. కుక్కలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో పాటు స్పా  సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎక్కువ కాలం తమ హోటల్ లో గడిపే శునకాలకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామని ప్రకటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement