ఛత్తీస్గఢ్లో తొమ్మిదిమంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి.
రాయపూర్ : ఛత్తీస్గఢ్లో తొమ్మిదిమంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. నారాయణ్పూర్ జిల్లా కొసల్నార్ అటవీ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న మావోలను విచారిస్తున్నారు. వీరు పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసినవారిలో ఇద్దరిపై రివార్డు ఉంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.