హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) సోకిన రోగుల శరీరంలో యాంటీ రిట్రోవైరల్ చికిత్స తర్వాత కూడా మిగిలి ఉండే వైరస్‌ను పూర్తిగా నిర్మూలించగల కొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
న్యూయార్క్: హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) సోకిన రోగుల శరీరంలో యాంటీ రిట్రోవైరల్ చికిత్స తర్వాత కూడా మిగిలి ఉండే వైరస్‌ను పూర్తిగా నిర్మూలించగల కొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూయార్క్‌లోని బ్రాంక్స్ ప్రాంతానికి చెందిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని రూపొందించారు. రేడియో ఇమ్యూనో థెరపీ (ఆర్‌ఐటీ) పేరిట రూపొందించిన ఈ చికిత్సా విధానంలో నిర్వహించిన పరీక్షలు విజయవంతమైనట్లు చెబుతున్నారు.