తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్ | Nations have to make effort to combat black money menace, says Swraj Paul | Sakshi
Sakshi News home page

తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్

Nov 23 2014 2:19 PM | Updated on Apr 3 2019 5:16 PM

తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్ - Sakshi

తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్

నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

లండన్: నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం వల్ల కలిగే నష్టాలను చాలా దేశాలు ఇప్పుడు గుర్తించాయని అన్నారు. నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం వలన కలిగే విపరిణామాలపై కళ్లు తెరిచాయని పేర్కొన్నారు.

ఇకనైనా నల్లధనంపై పోరును ఉధృతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచిన సొమ్మును నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలపై స్వరాజ్ పాల్ స్పందించారు. నల్లధనం ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదన్నారు. బ్లాక్మనీ నిర్మూలనకు అన్నిదేశాలు కలిసిరావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement